![]() |
![]() |

ఇనయ సుల్తానా.. బిగ్ బాస్ సీజన్-6 ద్వారా ఫేమస్ అయింది. ఆర్జీవితో కలిసి ఒక ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ చేసి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న అప్పట్లో ట్రెండింగ్ లో ఉంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తన మాటలతో, టాస్క్ లో ఒంటరిపోరాటంతో తెగింపు ధైర్యం ఎక్కువేనని ఎవరికి భయపడదని నిరూపించింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక పలు సినిమా అవకాశాలు పొందిన ఇనయా. షూటింగ్ లో బిజీగా ఉంటూ వస్తోంది. 'ఏవమ్ జగత్', 'బుజ్జి ఇలా రా', 'నట రత్నాలు', 'క్రాంతి' వంటి సినిమాల్లో నటించిన ఇనయాకి పెద్దగా గుర్తింపు రాలేదు . దాంతో తనే ఆఫర్స్ కోసం ఇలా బోల్డ్ ఫోటో షూట్స్ తో అట్రాక్ట్ చేస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే తను మాత్రం .. "నేనెవరి మాటలు వినను. నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు నచ్చినట్టు నేను ఉంటాను" అని ప్రతిసారీ చెప్పుకొస్తుంది ఇనయా. ఎప్పటికప్పుడు తన ఇన్ స్ట్రాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఇనయా.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వీడీయోలు చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. అయితే ఎప్పుడు బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ తో కనిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది ఇనయా. మొన్నటిదాకా ఊటీకెళ్ళి అందాలు ఆరబోసిన ఇనయా.. ఇప్పుడు తాజాగా మరో బోల్డ్ లుక్ తో ఇన్ స్టాగ్రామ్ లోని యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది.
అయితే ఇనయాకి సినిమాలంటే పిచ్చంట. సినిమాల్లో ఛాన్స్ రావాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు నటించడం కూడా రావాలని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఇనయా అభిమానులు మాత్రం తన హాట్ ఫోటోస్ ని డిలీట్ చేయమని కామెంట్ చేస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బ్లూ డ్రెస్ లో కొన్ని ఫోటోస్ ని అప్లోడ్ చేయగా.. అందులో నాల్గవ ఫోటోలో కాలెత్తి నిల్చొని దిగిన ఫోటో మరీ బోల్డ్ గా ఉందంటూ, దానిని తీసేయాలని తన ఫ్యాన్ ఒకరు కామెంట్ చేయగా, మరి ఇంత ఫైరేంటి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఇనయా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.
![]() |
![]() |